- మా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం లేదు
- గతంలో అర్ధరాత్రి రేవంత్‌రెడ్డి ఇంటి తలపులు పగులగొట్టారు
- జన్వాడ ఫాంహౌస్ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అధికారంలో ఉన్న ప్పుడు బీఆర్‌ఎస్ నాయకులకు చట్టం గుర్తుకు రాలేదా అని తెలంగాణ కాంగ్రెస్ ప్రశ్నించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి నివాసంలోకి ప్రోటోకాల్ పాటించకుండా, ఆయనేదో సంఘ విద్రోహశక్తి అన్నట్లుగా అర్ధరాత్రి బెడ్‌రూమ్ తలుపులు పగులగొట్టి పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారని ఆరోపించింది.
ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు వచ్చిన వీడియోను ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సోమవారం పోస్ట్ చేసింది. ‘ నేడు పోలీ సులు బాధ్యాతయుతంగా వారి విధులు నిర్వహించారు. కక్షలకు పోకుండా ప్రభుత్వం పారదర్శకంగా ప్రవర్తించారు. ఈ రోజు నీ బామ్మర్ది ఫాంహౌస్‌లో పార్టీ గురించి స్థానికులు ఫిర్యాదు చేస్తే పోలీసులు సెర్చ్ చేశారు.
నిషేధిత లిక్కర్, క్యాసినోకు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకొని, డ్రగ్స్ పరీక్షల వివరాలను పోలీసులు తెలిపారు’ అని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొంది. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసింది మీరేననే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.