calender_icon.png 11 October, 2024 | 6:51 AM

సీఎం రేవంత్‌రెడ్డిని నమ్మేది లేదు

11-10-2024 12:57:12 AM

ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ అమలు చేస్తామన్న హామీ ఏమైంది?

తక్షణమే గ్రూప్స్  పరీక్షలు వాయిదా వేయాలి 

ఈ నెల 16న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోని  సీఎం రేవంత్ రెడ్డిని నమ్మేది లేదని, వదిలేదీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ  హెచ్చరించారు. వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుత నోటిఫికేషన్లలోనే అమలు చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించా రు.

మీ పరిధిలోనే ఉన్న విద్యాశాఖలో వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేయ డం అంటే మాదిగలకు ద్రోహం చేసినట్టు కాదా అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. వర్గీకరణ అమలు చేయకుండా ఇప్పటికే రెండు నెలల సమయం వృథా చేశారని, మరో రెండు నెలల సమయం వృథా చేసేం దుకు  ప్రభుత్వం కుట్ర చేస్తుందని  ఆరోపించారు.

పార్శీగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీ య కా ర్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేదాకా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం కాదని,  ఇచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణను ఎందు కు అమలు చేయలేదని ప్రశ్నించారు.

వచ్చే రెండు నెలల్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేయాలని  చూస్తున్నార ని ధ్వజమెత్తారు. టీచర్ పోస్టులలో మాదిగలకు భారీ అన్యాయం జరిగిందన్నా రు.  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి.. 

గ్రూప్స్ పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. వర్గీకరణ లేకుండా కేవలం వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే ఉద్యోగాల భర్తీకి భట్టి విక్రమార్క అనుమతించడం అంటే మాదిగలకు మాదిగలతోనే కుట్ర చేయిస్తున్నట్టు స్పష్టమవు తోందన్నారు.

ఈ నెల 16న వరంగల్‌లో జరిగే రాష్ట్ర కమిటీ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ఆ తర్వాత మాదిగల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిం ద్ నరేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.