టీజీజెన్‌కో ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31(విజయక్రాంతి): ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యు సంస్థల ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీఘర్‌లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు నిరస మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు టీజీజెన్‌కో ఈఆర్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడు ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 27లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు నిరసనల్లో పాల్గొంటున్నారన్నారు. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ కానివ్వకుండా ఉండేందుకు ఎంతవరకైనా వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు.. ఈశ్వరయ్యగౌడ్, సదానందం, మనో శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌కుమార్, కిరణ్, భాగయ్య, సతీష్, వెంకటేశ్, భాస్కర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.