- ప్రైవేటు సంస్థల వల్ల ఆటో కార్మికులకు తీవ్ర నష్టం
జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించిన ఆటో యూనియన్ జేఏసీ నాయకులు
మహబూబ్ నగర్, జనవరి 6 ( విజయ క్రాంతి): ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళ లకు ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కు ఓలా, ర్యాపిడో లాంటి ప్రైవేట్ సంస్థలు రావడంతో ఆటో కార్మికుల బతుకు అగమ్య గోచరంగా మారుతున్నాయని ఆటో యూని యన్ల జేఏసీ నాయకుడు రాములు యాద వ్, నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవా రం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున ఆటోడ్రైవర్లు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు మహబూబ్ నగర్‌కు రావడం అన్యాయమన్నారు. ఈ సంస్థల రాకతో ఆటో కార్మికుల కుటుంబాల జీవనానికి ప్రమాదం ఏర్పడిందని చెప్పారు.
ఈ ప్రైవేట్ సంస్థలు పట్టణంలో రాకుండా చేయాలని ఇటీవలే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వెంటనే ఈ సంస్థలు పట్టణం నుంచి వెళ్లిపోవాలని, ఆటో కార్మి కుల సమస్యలను పరిష్కరించకపోతే ఉదృ తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతా మని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో షేక్ బాబుమియా, రాజు, కృష్ణ, చెన్నయ్య, అంజనేయలు, తిరుపతయ్య, యాదగిరి, మహేష్, హాష్మి, శ్రీను, లక్ష్మయ్య, ఫజల్, ఫక్రు, వీరేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.