calender_icon.png 19 November, 2024 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాచాల్సిన అవసరంలేదు

12-11-2024 12:00:00 AM

సినీ పరిశ్రమలో నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న హీరోయిన్లు జాబితా చాంతాడంత ఉంటుంది. ఆ లిస్టులో ప్రధానంగా వినిపించే పేర్లు త్రిష, అనుష్క. ఈ కారణంగానే వీరి పెళ్లి గురించి చర్చ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ఆసక్తికరమే. తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేసిన బెంగళూరు బ్యూటీ అనుష్క గురించిన వార్తయితే ఆమె అభిమానులకు మరీ స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.

ఓ దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ తరుణంలో తన పెళ్లి వార్తలపై అనుష్క తొలిసారి స్పందించింది. ‘నాకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో నేనెప్పుడూ బాధ పడిందిలేదు.

అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడంలేదు. పెళ్లి విషయాన్ని దాచాల్సిన అవసరంలేదు. అది నేరం కాదు.. భావోద్వేగంతో కూడిన విషయం. అసత్య ప్రచారం చేయడం ఇకనైనా ఆపండి. ఆ టైమ్ వస్తే అందరికీ తెలియజేస్తా’ అని పేర్కొంది స్వీటీ. అనుష్క ప్రస్తుతం ‘ఘాటి’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.