కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఎలక్ట్రిక్ వాహనా లను (ఈవీలు) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈవీల ఉత్పత్తిదారులకు ఇక సబ్సిడీలు అందించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వినియోగదారులే వారికి కావాల్సిన ఈవీలు లేదా సీఎన్‌జీ వాహనాల్ని ఎంపికచేసుకుంటున్నారని అన్నారు. గురువారం ఒక సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ తొలుత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యయం ఎక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు ఈవీలకు డిమాండ్ పెరిగిందని, ఉత్పత్తి వ్యయం తగ్గిందన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలకు జీఎస్టీ తక్కువని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈవీల తయారీకి ప్రభుత్వం ఇక సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు. తయారీదారులు సబ్సిడీలు కోరడం న్యాయసమ్మతం కాదన్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలపై మరిన్ని పన్నులు వేయం
చమురు ఇంధనాల నుంచి ప్రత్యా మ్నాయ ఇంధనాలకు మారే ప్రక్రియ క్రమే పీ జరుగుతుందని గడ్కరీ చెపుతూ పెట్రోల్, డీజిల్ వాహనాలపై అదనపు పన్నులు విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రస్తు తం హైబ్రీడ్ వాహనాలతో సహా ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లు కలిగిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ పన్ను విధిస్తుండగా, ఎలక్ట్రిక్ వాహనాలపై ఇది 5 శాతంగా ఉన్నది. రెండేండ్లుగా డీజిల్, పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయని, ఈవీల తయారీ వ్యయం తగ్గిం దన్నారు. లిథియం బ్యాటరీ వ్యయం మరిం త తగ్గితే ఈవీల వ్యయాలు కూడా దిగివ స్తాయన్నారు.