13-02-2025 02:10:01 AM
నేడు రాజకీయ పార్టీలతో కలెక్టర్ల సమావేశం
కరీంనగర్/సిరిసిల్ల, ఫిబ్రవరి12 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగంగా జరుగుతోంది. ఓ వైపు రాజకీయ వేడి పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం, రాష్ర్ట ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లు ఒకటి రెండు రోజు ల్లో ఖరారు కానున్నట్టు సమాచారం.
బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పిం చిన నివేదికపై సమీక్షించిన అనంతరం బీసీ లకు రిజర్వేషన్లు ప్రకటిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50శాతం సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫా ర్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వా నికి పంపించాలని పేర్కొన్నట్లు సమాచారం.
సిద్ధం చేసిన అధికారులు
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్ని కల కోసం అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో 318 గ్రామ పంచా యతీలు ఉండగా 318 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గంగాధర మండలంలో అత్యధికంగా 33 గ్రామ పంచా యతీలు ఉండగా అత్యల్పంగా కొత్తపల్లి మం డలంలో 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
అలాగే 15 జడ్పీటీసీ స్థానాలు, 170 ఎంపీటీసీ స్థానాలు, 2962 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 15 మంది ఎంపీపీలు కూడా ఎన్నిక కానున్నా రు. జిల్లాలో మొత్తం 5,08,489 మంది ఓటర్లు ఉండగా 2,47,652 మంది పురుషు లు, 2,60,825 మంది మహిళా ఓటర్లు, 12 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా 13,173 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడం విశేషం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు ఉండగా 12 మంది జడ్పీటీసీలు, 12 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. అలాగే 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చారు. జిల్లాలో మొత్తం 3,53,796 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,71,174 మంది, 1,82,602 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు.