ఎయిరిండియా ప్రకటన
న్యూఢిల్లీ, నవంబర్ 11: విమానాల్లో అందించే ఫుడ్ విషయంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. హిందూ, సిక్కు కమ్యూనిటీలకు చెంది న ప్రయాణికులకు ఇకపై హలాల్ సర్టిఫైడ్ ఫుడ్‌ను అందించబోమని తెలిపిం ది. అయితే భోజనాన్ని ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ ను కేవలం ముస్లింలకు మాత్రమే అం దిస్తామని చెప్పింది. అంతేకాకుండా సౌదీఅరేబియా, హజ్ మార్గాల్లో నడిచే విమానాల్లో హలాల్ సర్టిఫైడ్ భోజనమే ఉంటుందని వివరించి ంది. ఎయిరిండియా విమానాల్లో హిందూ, సిక్కు ప్రయాణికులకు హలాల్ ఫుడ్ అందించడంపై పదేళ్లుగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.