12-09-2024 02:44:29 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారతీయ రైల్వేలు ఆలస్యానికే కాదు.. నాణ్యతలేని ఆహారానికి కూడా ప్రసిద్ధి అని చాలాకాలంగా అపవాదు ఉన్నది. దాన్ని తొలగించుకొనేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకపై రైళ్లలో శుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు క్లౌడ్ కిచెన్లను అందుబాటులోకి తేనున్నది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న బేస్ కిచెన్లలో వండిన ఆహారం నాణ్యతపై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వాటి స్థానంలో ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా క్లౌడ్ కిచెన్లలో వండిన ఆహారాన్ని ప్రయాణీకులకు అందించే ఏర్పాట్లు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 200 క్లౌడ్ కిచెన్ల ద్వారా ఈ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముంబైలోనే 50 వరకు క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేసినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.