calender_icon.png 29 December, 2024 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక స్వచ్ఛ తటాకాలు

29-12-2024 01:02:56 AM

  1. మురుగు బారినపడిన చెరువుల శుద్ధికి రూ.1,100 కోట్ల కేటాయింపు
  2. పటాన్‌చెరు నియోజకవర్గంలో 7 చెరువులు ఎంపిక

పటాన్‌చెరు, డిసెంబర్ 28: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో మురుగుబారిన పడిన చెరువులను శుద్ధి చేసి స్వచ్ఛ తటాకాలుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయి. అమృత్ 2.0 కింద చెరువు నీటిని శుద్ధి చేయడానికి సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల  నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాయి.

ఇందులో భాగంగా నియోజవర్గ పరిధిలోని ఏడు చెరువుల వద్ద ఏడు ఎస్‌టీపీ ప్లాంట్లను రూ.1,100కోట్లతో నిర్మించి మురుగునీటికి కేంద్రాలుగా మారిన చెరువులకు పునర్‌వైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. అయితే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి భూమి కేటాయింపు జరగిన వెంటనే ప్లాంట్ల నిర్మాణం ప్రక్రియ ప్రారంభంకానుంది.

భూకేటాయింపు తర్వాత టెండర్ల ద్వారా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మా  జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం 25శా  రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, మిగత 40 శాతం నిధులు సంబంధిత కాంట్రాక్టర్ బీవోటీ పద్ధతిలో నిధులు కేటాయింపుతో పనులు చేపట్టనున్నారు. గతంలో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి స్థలాలు పరిశీలించినప్పటికీ అడుగులు ముందుకు పడలేదు.

ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఐదు మండలాల తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించి ఎస్‌టీపీ ప్లాంట్ల నిర్మాణానికి భూములు కేటాయించాలని ఆదేశించారు. చెరువుల వద్ద సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణంపై జలమండలి, ఎస్‌టీపీ అధికారులతోనూ ఎమ్మెల్యే సమీక్ష జరిపారు.

ఎస్  ప్లాంట్లను నిర్మించి చెరువు నీటిని శుద్ది చేయడంతో పాటు చెరువుల్లోకి వచ్చే మురు  నీటిని శుద్ది చేసి చెరువుల్లోకి నీటిని వదలనున్నారు. చెరువు నీటిని పూర్తిగా స్వచ్ఛమైనవిగా మార్చే ఈ ప్రక్రియ నియోజకర్గంలో త్వరలోనే ప్రారంభంకానున్నది. 

ఎంపిక చేసిన ఏడు చెరువులు..

పటాన్‌చెరు నియోజకవర్గంలో మురుగుబారిన పడిన చెరువులను తిరిగి స్వచ్ఛ నీటితో నింపేందుకు ఏడు చెరువులను ఎంపిక చేశారు. వీటి సమీపంలో ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించి ఈ ఏడు చెరువుల్లోని నీటి శుద్ధి చేయున్నారు. వాటి వివరాలు.. తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికేబావి చెరువు, ఇక్రిశాట్ చెరువు, గండిగూడెం చెరువు, బచ్చుగూడెం చెరువు, అమీన్‌పూర్ పెద్ద చెరువు వద్ద సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నారు.