* సిటీ పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చిందన్నారు.
ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసుశాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని, సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఘటనకు సంబంధించి ఏ పౌరుడి వద్దునా ఆధారాలు, అదనపు సమాచారం తమను సంప్రదించాలని పేర్కొన్నారు.