calender_icon.png 12 October, 2024 | 12:56 PM

ఏ టైటిల్ పెట్టినా సినిమా బాగుంటేనే చూస్తారు

10-10-2024 12:00:00 AM

సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏషియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం వారు ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “వేట్టయాన్’ను తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్‌ను పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరేవాళ్లకి ఉంది. తమిళంలోనూ ఒకప్పుడు తమిళ ఆ భాషా టైటిల్సే పెట్టాలనుకున్నారు. ఇప్పుంతా మారిపోతోంది. సినిమా గ్లోబల్‌గా ఎదిగింది. వేరే భాషల్లో అనువాద టైటిల్స్ దొరికితే పెడుతున్నారు.

లేదంటే ఒకే టైటిల్‌ను అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఒకే టైటిల్‌తో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏ టైటిల్ పెట్టినా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. సినిమాను సినిమాలా చూడండి” అన్నారు. ‘సినిమాకు భాష లేదు.. హద్దుల్లేవు.

కథను బట్టి చిత్రం ఎక్కడికైనా వెళ్లొచ్చు’ అని రానా దగ్గుబాటి తెలిపారు. ఇతర భాషా టైటిల్స్‌తో చిత్రాలను తెలుగులో విడుదల చేస్తుండటంపై ఇటీవల సినీప్రియులు, భాషాభిమానుల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ‘వేట్టయాన్’ టైటిల్‌పై తాజా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.