- ప్రభుత్వానికి అండగా ఉంటాం
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
- టైగర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నూనె శ్రీధర్
మానకొండూర్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం తమ ఇంజినీర్లకు ఎలాంటి ప్రా జెక్టుల పనులను అప్పగించినప్పటికీ వాటి ని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయే ట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టైగర్) రాష్ర్ట అధ్యక్షులు నూనె శ్రీధర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని ఎల్‌ఎండి కాలనీలోని సీఈ కార్యాల యంలో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో శనివారం విస్తృతస్థాయి సమా వేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి (టైగర్) అసోసియేషన్ రూపకర్తలు రిటైర్డ్ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెట రీ బి.నాగేంద్రరావు, ఉపాధ్యక్షులు సుధాక ర్ రెడ్డి, మహేష్ గౌడ్‌తో పాటు ఈఎన్‌సీ శంకర్, సీఈ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ర్ట అధ్యక్షులు నూనె శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఉన్న సమస్యలు, పెండింగ్ బిల్స్, విషయంలో పలువురి అభిప్రాయాల ను వినతిరూపంలో తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొంతకాలంగా ఉద్యోగుల సమస్యలపై సతమతవుతున్నా మని, ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం తమ సమస్యలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రిటైర్డ్ అయినప్పటికీ వారి పెండింగ్ బిల్స్, ఉద్యోగుల ఇతర బిల్స్, జాప్యం జరగడం వల్ల చాలా ఇబ్బం దులకు గురవుతున్నారని, ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ భవనం నిర్మాణం చేపట్టేందుకు కరీంనగర్, హైదరాబాద్, ప్రాంతాల్లో స్థలం కేటాయిస్తే భవన నిర్మాణం చేపట్టుకుం టామని తెలిపారు.
ఉద్యోగులకు ఎక్స్ టెన్షన్స్ సర్వీస్లను రద్దు చేయాలని రాష్ర్ట ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మం త్రులను కలిసి నివేదిక సమర్పించామని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వానికి వెంట ఉంటామని, ఏ రాజకీయాలతో తమకు సంబంధం లేదని, అన్ని అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి చేరువ చేయడంలో తాము నిత్యం కృషి చేస్తామని అన్నారు. అనంతరం పలువురు రిటైర్డ్ ఉన్నతాధికా రులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌ఎండీ క్యాంపు ఈఈ నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.ప్రకాష్, టీవీ ప్రసాద్, రామ్‌ప్రవీణ్, పరశురామ్ గౌడ్, కవిత, మునీంద్ర, అభినవ్ రెడ్డి, 31 జిల్లాల డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.