calender_icon.png 6 March, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ ఎన్నికలు వచ్చినా బిజెపిదే విజయం

06-03-2025 04:56:09 PM

చేర్యాల (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన బిజెపిదే విజయం అని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బూర్గోజు నాగరాజులు అన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలోని పోలీస్ బొమ్మ వద్ద గురువారం కార్యకర్తలు బాణాసంచా పేల్చి, భక్తులకు, స్థానికులకు మిఠాయిలు పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్నికలు ఏవైనా బిజెపి విజయ దుందుభి మోగించడం ఖాయమని అన్నారు.

ఏ ఎన్నికలు వచ్చినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బిజెపి జెండా ఎగరవేస్తామన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గణ బోయిన శ్రీనివాస్ గౌడ్, కుడి కుడి మల్లేశం, గుర్రాల రాములు, కొయ్యడ నవీన్ గౌడ్, పుట్ట కనకయ్య, మహిళా నాయకురాలు స్వరూప, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.