calender_icon.png 21 October, 2024 | 1:15 PM

ఎంత దూరమైనా వెళ్లేదాన్ని..

20-10-2024 12:03:10 AM

మానసి పరేఖ్.. ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్త మ నటిగా అందరి దృష్టినీ ఆకర్షించిందీ భామ. గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో ఈ అమ్మడు అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఫలితంగా ఈ సొగసరి పేరు అన్ని పరిశ్రమల్లోనూ మారుమోగింది. తాజాగా మానసి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంది. “రోజూ ఉదయం 8 గంటలకు మూడు జతల బట్టలు తీసుకుని ఆడిషన్స్‌కు ఎంత దూరమైనా వెళ్లిపోయేదాన్ని. ఒక్కోసారి ఒక పాత్రకు 150 మంది ఉండేవారు. అయినా ఆడిషన్ పూర్తయ్యాకే ఇంటికి వెళ్లేదాన్ని. పోరాటాలు, కష్టాలు ఏవైనా సరే వెనుకడుగు వేయవద్దని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎన్నో కష్టాల తర్వాత వచ్చే విజయం మరింత మధురంగా ఉంటుంది” అని మానసి పరేఖ్ తెలిపారు.