calender_icon.png 17 January, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబలెంకా.. నీకెదురేలేదింకా

09-09-2024 02:56:01 AM

  1. టైటిల్ నెగ్గిన బెలారస్ స్టార్ 
  2. పోయినేడాది తృటిలో చేజారిన ట్రోఫీ 
  3. తప్పులు పునరావృతం చేయని వైనం 
  4. యూఎస్ ఓపెన్

సబలెంకా యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఇది తొలిసారి. 2021,22లలో సెమీఫైనల్లో తడబడ్డ సబలెంకా తొలిసారి 2023లో ఫైనల్ గడప తొక్కింది. సబలెంకా.. తనకు ఎదురులేదింకా అని మరోమారు నిరూపించింది. మొన్నటికి మొన్న సిన్సినాటి మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఈ బెలారస్ చిన్నది ఈ సారి ఏకంగా యూఎస్ ఓపెన్ టోర్నీనే ఒడిసిపట్టింది. 2023లో తృటిలో తన నుంచి చేజారిన ట్రోఫీని ఈ ఏడు రెండు చేతుల్లో బంధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థుల మీద తనదైన ఆధిపత్యం ప్రదర్శించిన వరల్డ్ నంబర్ 2 ఫైనల్లో కూడా అదే ఆటతీరుతో వరుస సెట్లలో విజయాన్ని అందుకుంది. కెరీర్లో తొలి సారి యూఎస్ ఓపెన్‌ను ముద్దాడిన ఈ చిన్నది స్వియాటెక్‌ను ఓడించిన పెగులాకు భారీ పంచ్ ఇచ్చింది. 

విజయక్రాంతి ఖేల్ డెస్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌ను వరల్డ్ నంబర్ 2 సబలెంకా ఎగరేసుకుపోయింది. టోర్నీ ఫైనల్లో సబలెంకా (బెలారస్) 7 7 తేడాతో పెగులా (అమెరికా) మీద విజయఢంకా మోగించింది. తద్వారా తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.  

పెగులా.. ఊహించని విధంగా 

వరల్డ్ నంబర్ 6 ర్యాంకర్ అయిన పెగు లా ఎవరూ ఊహించని విధంగా అమెరికన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్ స్వియా టెక్‌ను ఓడించిన పెగులా సెమీస్‌లో ముచోవాను బురిడీ కొట్టించింది. ఇక ఫైనల్లో మాత్రం సబలెంకా మీద విజయం కోసం చెమటోడ్చినా కానీ సబలెంకా పెగులా పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో ఈసారికి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సబలెంకాకు అంత సులభమైన విజయం దక్కలేదు. దాదాపు 2 గంటల పాటు పెగులా సబలెంకాను ఆటాడించింది.  

సబలెంకాకు వచ్చిందెంతంటే??

యూఎస్ ఓపెన్ నెగ్గిన సబలెంకాకు అక్షరాలా 36 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీగా అందాయి. రన్నరప్‌గా నిలిచిన పెగులాకు అందులో సగం అమౌంట్ అంటే 18 లక్షల డాలర్లు అందాయి. పురుషుల టైటిల్ గెలిచిన క్రీడాకారులకు, రన్నరప్‌గా నిలిచిన వారికి కూడా ఇంతే అందనుంది. 

ఎవరు గెలిచేనో? 

పురుషుల సింగిల్స్ ఫైనల్ పోటీలో సిన్నర్ (ఇటలీ), ఫ్రిట్జ్ (అమెరికా)తో తలపడుతున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో.. నంబర్ 1 ర్యాంకర్ సిన్నర్ సిన్సినాటి ఓపెన్ గెలిచి మాంచి ఊపుమీదున్నాడు.