calender_icon.png 21 November, 2024 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్ళొద్దు.. పిల్లలొద్దు !

19-11-2024 12:00:00 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో..  యుఎస్ మహిళలు దక్షిణ కొరియా మహిళల మాదిరిగా 4బీ ఉద్యమానికి దిగిన విషయం తెలిసిందే. శృంగారానికి దూరంగా ఉంటామని, పిల్లల్ని కనమని బహిరంగంగానే  నిరసనకు దిగారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపు అబార్షన్ హక్కులకు వినాశకరమైనదని ఆరోపిస్తూ రోడ్డెక్కుతున్నారు. అసలు 4బీ ఉద్యమం ఏంటి? ఎలా మొదలైంది? అనే విషయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

తమ హక్కులపై జరుగుతున్న దాడులు, ఎదుర్కొంటున్న వివక్షపై ఆడవాళ్ల ఆగ్రహం ఒక ఉద్యమరూపంగా మారింది. ఈ ఉద్యమానికి దక్షిణకొరియాలో పుట్టిన 4బీ ఉద్యమం స్ఫూర్తిగా నిలు స్తోంది. డోనల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజే ‘4బీ ఉద్యమం’ తెరపైకి వచ్చింది. “ఈ పరిస్థితుల్లో మా హక్కులను తిరిగి పొందే వరకు మరొక వ్యక్తి మమ్మల్ని తాకనివ్వం” అంటూ యూఎ స్ మహిళలు సవాల్ చేస్తున్నారు.

అబార్షన్ హక్కులపై

తమ నుంచి అబార్షన్ హక్కులను లాగేసుకున్నారని అమెరికన్ మహిళలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పురుషులతో డేటింగ్ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఈ నేపథ్యంలో 4బీ ఉద్యమం అమెరికావ్యాప్తంగా ఊపందుకుంది. ఈ క్రమంలోనే వేలాది మహిళలు 4బీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. అం దుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

మహిళల శరీరాలపై నిరంతం రాజకీయాలు జరుగుతున్నాయని.. అమెరికాలో ఒక గణనీయమైన మార్పును తీసుకురావడానికి సాహసోపేతమైన ‘4బీ’ ఉద్యమం అవసరం పడుతుందని భావిస్తున్నారు.

శారీరక సంబంధాలకు దూరం

రాబోయే నాలుగు సంవత్సరాలు పురుషులతో శారీరక సంబంధాలకు దూరంగా ఉండటమే లక్ష్యంగా తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు యూఎస్ మహిళలు. ట్రంప్ ఉన్నంత కాలం శారీరక సంబంధాలను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పురుషులందరూ మహిళల హక్కులను తీసివేయడానికి ఓటేస్తే.. రాబోయే నాలుగేళ్లలో మమ్మల్ని తాకడానికి అర్హులు కాదంటూ మహిళలు బహిరంగ నిరసనలు చేస్తున్నారు.
‘ఒక మహిళగా నా శారీరక హక్కులు నా సొంతం. దానిపై సార్వభౌమాధికారాన్ని అమలు చేయడానికి ఇదొక మార్గం’ అనే అభిప్రాయంతో యూఎస్ మహిళలు 4బీ ఉద్యమాన్ని మరింత బలపరుస్తున్నారు. 

4బీ ఉద్యమం అంటే?

4బీ ఉద్యమం 2017లో దక్షిణ కొరియాలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మహిళల ఉద్యమాలు పెరిగిన తర్వాత 2019లో బాగా పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియా మహిళలు ఈ 4బీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ 4బీ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అసలు 4బీ ఏంటంటే..

* నో మేరేజ్ 

*  నో డేటింగ్

*  నో సెక్స్

* నో చిల్డ్రన్