ఇంటర్ బోర్డు చైర్మన్‌కు అభినందనలు తెలుపుతున్న జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
- మ్యాన్యువల్‌గా ఫైళ్లు సమర్పించొద్దు
- ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శి కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డులో పరిపాలనంతా ఇకపై ఈ జరగాలని అధికారులను ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శి, డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం నాంపల్లిలోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఫైళ్లు ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ పెండింగ్ లేకుండా చూడాలన్నారు. మ్యాన్యువల్‌గా కాకుండా ఈ విధానంలోనే ఫైళ్లు సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం పనిచేస్తున్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ గర్తుంచుకోవాలని సూచించారు.
శుభాకాంక్షల వెల్లువ..
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ఆదిత్యను పలు సంఘాల నేతలు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనకచంద్రంతోపాటు ప్రిన్సిపాల్స్ సంఘం నేతలు, బోర్డు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.