calender_icon.png 27 February, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారిపై జీవితకాల నిషేధం వద్దు..

27-02-2025 12:39:59 AM

దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు కేంద్రం ఊరట

ప్రస్తుతం ఆరేళ్ల నిషేధం అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ 2016లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సు ప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ విషయంపై స్పం దనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కోరగా.. కేంద్రం తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎవరైనా చట్ట సభ్యులు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలితే ప్రస్తుతం వారి మీద ఆరు సంవత్సరాల పాటు నిషేధం అమలులో ఉంది.

“జీవితకాల నిషేధం సరైనదేనా? కాదా? అనే ప్రశ్న పార్లమెంటు పరిధిలోకే వస్తుంది.” అని కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. సెక్షన్ 8 ప్రకారం ప్రజాప్రతినిధులు తప్పు చేసినట్లు తేలితే ఆరేళ్ల పాటు, నిషేధం అమలులో ఉంది. దోషులుగా తేలి న రాజకీయ నాయకులకు ఆరేళ్ల నిషేధం కా కుండా జీవిత కాలం పాటు వారిని నిషేధించాలని పిటిషన్ కోర్టును కోరారు.