ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉండి సిరిసిల్లకు నూలు డిపో కూడా తీసుకురాలేదని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేటీఆర్ వల్ల సిరిసిల్ల లో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదన్నారు. మంగళవారం ఆయ న సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కార్మికుల క్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
స్వయం సహాయ సంఘాల మహిళలకు ప్రభుత్వం రెండు చీరలు ఇవ్వ బోతుందని, చీరల తయా రీ ఆర్డర్‌ను సిరిసిల్ల పవర్‌లూమ్స్‌కు అప్పగించిందన్నారు. వేములవాడలో రూ.50 కోట్లతో నూలుడిపో, 90 శాతం సబ్సిడీతో కార్మికులకు నూలు సరఫరా చేస్తున్నామన్నారు.