calender_icon.png 29 September, 2024 | 9:54 PM

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు

29-09-2024 02:01:57 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మెదక్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు.

శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూ సమస్యలపై నిర్వహించిన సమీ క్షా సమావేశానికి చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్, రాంబా బు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భం గా వెంకటయ్య మాట్లాడుతూ..

ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లాలోనే సాంఘీక బహిష్కరణలు, దాడులు జరుగుతున్నాయ ని ఆవేద న వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాలపై దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

అధికారులు ప్రొటోకాల్ పాటించట్లేదు

ఇంత ఉన్నత పదవిలోఉన్న తనకే అవమానం జరిగిందని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..

కమిషన్ చైర్మన్‌గా మంత్రి తర్వాత ప్రొటోకాల్ తనకే ఉంటుందని.. అయితే ఇటీవల జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ పాల్గొనగా తాను కూడా వస్తున్నట్లు ముందుగానే కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ కనీసం వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

గౌతోజిగూడలో పర్యటన

మనోహరాబాద్: మనోహరాబాద్ మం డలం గౌతోజిగూడంలో డప్పు కొట్టలేదని గ్రామ బహిష్కరణ చేసిన ఘటన తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంక టయ్య తన బృందంతో గ్రామాన్ని సందర్శించారు. బహిష్కరణకు గురైన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషయంలో పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అందాల్సిన పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.