ఆదిలోనే నిరసన సెగ
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదిలోనే నిరసనలు మొదలయ్యాయి. జిల్లా పరిధిలోని సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆయా పంచాయతీల ప్రజలు సోమవారం మండల కేంద్ర మైన సుజాతనగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు.
కార్పొరేషన్ వద్దు.. పల్లె ప్రాంతా లే ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్పొరేషన్ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పా టు చేసుకుని ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతపత్రాలు సమర్పించారు. ఎటువంటి శాస్త్రీయత లేకుం డా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా బలవంతగా పల్లె ప్రాంతాలను పట్టణీకరణ చేయడం దారణమన్నారు.