calender_icon.png 12 October, 2024 | 9:59 AM

‘మహబూబ్ వ్యవహారాల్లో జోక్యం వద్దు’

12-10-2024 01:36:07 AM

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మహబూ బ్ కాలేజీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వెంకట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మాధవిదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ కాలేజీ విషయంలో వీఎన్‌ఈఎస్ జోక్యంపై మహబూబ్ సంస్థ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి విచారణ చేపట్టారు.

ప్రతివాదులు చట్ట వ్యతిరేకంగా కళాశాల ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం న్యాయమూర్తి ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ చేశారు. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సొసైటీకి చెందిన అనిల్‌కుమార్, కేవీకే, శ్రీహర్ష మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో విద్యా కార్యకలాపాలను నిర్వ హించుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘించడంతో సికింద్రాబాద్ సివిల్ కోర్టులో కేసులు దాఖలైంది. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.