- కంపెనీలన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కేనా?
- ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : పరిశ్రమలన్నీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకే రావాలా? వెనుకబడిన ప్రాంతాలైన కొడంగల్, పరిగి వంటి ప్రాంతాలకు అవసరం లేదా? అని బీఆర్‌ఎస్ నేతలపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. “కొడంగల్ ఫార్మా క్లస్టర్‌లో కంపెనీకి సీఎం అల్లుడు భూమి కేటాయించినట్లు 24 గంటల్లోనే నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని సవాల్ విసిరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఫార్మా క్లష్టర్‌లో కాలుష్యం లేని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారని, ఇక్కడ 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షగా ఉపాధి లభిస్తుందన్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్‌లో భూమి కోసం ఏ ఒక్కరూ దరఖాస్తుల చేసుకోలేదని, రూ.15వేల కోట్ల వరకు పెట్టు బడులు రాబోతున్నాయన్నారు. కలెక్టర్‌పై దాడి కుట్రను బయటపెడుతామని అన్నారు.