calender_icon.png 19 April, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్ లేదు..ఔట్ లేదు

14-04-2025 01:04:02 AM

తాగునీటి కి తండ్లాట తప్పదా..?

కరీంనగర్, ఏప్రిల్13 (విజయక్రాంతి): కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ కు మిడ్ మానేరు డ్యామ్ ను డి ఇన్ ఫ్లో ని ఆదివారం ను డి నిలిచి పోయింది అలాగే వరంగల్, నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు  అంసించే కాకతీయ కెనాల్ కు ఎల్‌ఎండి అందించే నీటి విడుదలను నిలిపివేశారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.12 లకు చేరుకుంది.

ఈ  నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు.  గతేడాది డిసెంబర్ 31 నాటికి 22.870 టీఎంసీల నీరు ఉన్నది. ఈ యేడాది జనవరి ఒకటి నుంచి యాసంగి పంట లకు నీటిని అందించారు. తొలుత 4 వేల క్యూసెక్కులతో దిగు వ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభించి, 5,500 క్యూసె క్కులకు పెంచారు.

నిజానికిమార్చి 31 వరకే చివరి తడికి నీటి ని విడుదల చేయాల్సి ఉండగా మరో  పడిరోజి రోజుల పాటు 2,500 క్యూసెక్కులు  శనివారం వరకు తాగునీటి అవసరా లకు విడుదల చేశారు. నీటి విడిసలతో ఎల్‌ఎండిలో  నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. ఆదివారానికి కేవలం 7.12 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది.

మిడ్ మానేరు ద్వారా నిన్న టి వరకు 2500 క్యూసెక్కుల నీరురాగా ఆ డ్యామ్ లో నీటి మట్టం పడిపోవడంతో నీటి విడుదలనిలిపివేశారు.  ఎల్‌ఎండీ జలాశయం 2.096 డెడ్ స్టోరేజీ కాగా, ఇప్పుడున్న 7.12 టీఎంల్లో డెడ్ స్టోరేజీపోను 5 టీఎంసీ నీరు మాత్రమే ఉం టుంది. రెండు నెలలు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు.

రోజుకు 143 క్యూసెక్కులు

నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద చేసిన ప్రణాళికల ప్రకారంగా ఎల్‌ఎండీ జలాశయం నుంచి 3 సెగ్మెంట్లకు తాగు నీటిని అందిస్తున్నారు. అందులో కరీంనగర్- రామడుగు సెగ్మెంట్ను పరిశీలిస్తే 87, ఎల్‌ఎండీ, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలో 312, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్ పరిధిలో 70 చొప్పున మొత్తం 469 ఆవాసాలు ఉన్నాయి.

మున్సిపాలిటీల్లో విలీనమైనవి మరో 25 కలిపి మొత్తం 494 ఆవాసాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి రోజు 143 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. అందులో ఒక్క కరీంనగర్కే 63 క్యూసెక్కులు అవసరం. అయితే, ఎల్‌ఎండీకి  ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథకు 3.852 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు.

కానీ, ఈరోజు వరకే చూస్తే డెడ్ స్టోరేజీ పోను ఉన్న నీరు సరిపోవడం కష్టం ఎందుకంటే డ్యామ్ లో  పే దుకు పోయిన షీల్ట్ వల్ల ఉన్న నీటి లభ్యత సరిపోదని నిపుణులు అంటూన్నారు