calender_icon.png 17 October, 2024 | 12:00 PM

డిఫాల్టర్లకు ధాన్యం కేటాయింపు ఉండదు!

17-10-2024 01:43:04 AM

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): డిఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్‌లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సచివాల యంలో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పా టు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రెండవ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ డిఫాల్టర్లుగా ఉన్నవారు ఇవ్వాల్సిన బియ్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. డిఫా ల్టర్ల విషయంలో కఠిన వైఖరి అవ లంబించాలని నిర్ణయించినట్టు తెలి పారు. ఈ సందర్భంగా పలువురు మిల్లర్లు సబ్ కమిటీకి తమ సమస్య లను విన్నవించారు.

సన్నరకం ధాన్యం 100 కిలోలు మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం వస్తుందని, అదే 100 కేజీల దొడ్డురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం వస్తుందని మిల్లర్లు డిప్యూటీ సీఎం, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.