అందరికీ జైహింద్ అని చెప్పాల్సిందే
హర్యానా విద్యాశాఖ వినూత్న నిర్ణయం
చండీగఢ్ (హర్యానా), ఆగస్టు 9: పంద్రాగస్టును పురస్కరించుకుని హర్యానా పాఠశాల విద్యా డైరెక్టరేట్ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాటు తోటి స్నేహి తులకు గుడ్ మార్నింగ్‌కు బదులుగా జైహింద్ అని చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తి, దేశంపై గౌర వం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధి కా రులు తెలిపారు. పంద్రాగస్టు రోజున జాతీయజెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ ప్రక్రి యను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.