calender_icon.png 18 November, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డుమ్మా పరంపరకు ఫుల్‌స్టాప్ లేదా

05-08-2024 01:20:44 AM

  1. వికారాబాద్ జిల్లాలో మూలకు చేరిన ‘మెషీన్లు’ 
  2. ఇక ఉపాధ్యాయులు తిన్నగా బడికి వచ్చేదెప్పుడు? 
  3. బయోమెట్రిక్ ప్రక్రియ అమలయ్యేదెప్పుడు? 
  4. ‘బంక్’ కొట్టే టీచర్లను గుర్తించేదెప్పుడు? 
  5. కొత్త ప్రభుత్వమైనా ‘హాజరు’ సంగతి పట్టించుకుంటుందా?

వికారాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ‘ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిరోజు నిర్దేశిత సమయానికి పాఠశాలకు రావాలి’ అనే మంచి సంకల్పంతో గత ప్రభుత్వం సర్కార్ బడు ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నది. కానీ విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడడంతో వికారాబాద్ జిల్లాలో బయోమెట్రిక్ విధానం అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాల ఒత్తిళ్ల నేపథ్యంలోనే బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోక పోవడం లేదనే విమర్శలున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు రూ.వేల కోట్లు విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నా ఆశించిన ప్రయోజనం కానరావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చ దువుతున్న విద్యార్థుల్లో కనీసం 50 శాతం మంది విద్యార్థులకు తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. రాయ లేకపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు బడికి వచ్చి నా పాఠాలు చెప్పక పోవడం, కొందరు ఉపాధ్యాయులు సంఘాల పేరుతో బయట తిరగడం వం టి ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. 

కొనసాగుతున్న అలసత్వం..

జిల్లావ్యాప్తంగా కొందరు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావ డంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతునాన్నాయి. సమయానికి పాఠశాలకు వెళ్లకపోవడం, సమయానికంటే ముందే ఇంటి ము ఖం పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక మారుమూల గ్రామా ల్లో అయితే ఉపాధ్యాయులు వంతులు వేసుకుని మరీ స్కూలుకు బంక్ కొడుతున్నారనే తెలుస్తోంది. పరస్పర ఒప్పందాలు చేసు కుని హాజరు పట్టికలో ఒకరి సంతకం ఒకరు పెడుతున్నట్లు సమాచారం.

ఇంకొందరు టీచర్లు ఉద యం పాఠశాలకు వచ్చి సం తకం పెట్టి, మళ్లీ పట్టణాలకు వెళ్లి తమ సొంత పను లు చూసు కుని, సాయంత్రం మళ్లీ పాఠశాలకు సంతకం పెట్టి వెళ్లిపోతున్నారని తెలిసింది. గత సం వత్సరం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వయంగా ఈ విష యాలను బయటపెట్టారు. ఇలాంటి సమస్యలకు బయోమెట్రిక్‌తో చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోలేదు.

బయోమెట్రిక్‌పై శిక్షణ..

ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలల్లో ఎలా బయోమెట్రిక్ హాజరు వేయా లనే అంశంపై  గతంలో విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. వారికి బయోమెట్రిక్ మెషిన్లు సైతం అందించింది. శిక్షణ తీసుకున్న ప్రధానోపా ధ్యాయులు బయోమెట్రిక్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రక్రియ అమలుకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల ఎంప్లాయిమెంట్ కోడ్‌ను సైతం విద్యాశాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు పంపించారు.

విద్యార్థుల నంబర్ల అనుసంధానం కూడా పూర్తయింది. అయినా బయోమెట్రిక్ ప్రక్రియ అమలుకు నోచుకోవడం లేదు. ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తేనే తప్ప ప్రభుత్వ బడులు గాడిలో పడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం ఆరంభించిన పనిని కొత్త ప్రభుత్వమైనా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లాలో మెషిన్లు ఇలా..

జిల్లావ్యాప్తంగా 1,054 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 764, ప్రాథమికోన్నత పాఠశాలలు 116, ఉన్నత పాఠశాలలు 174. అన్ని పాఠశాలల్లో కలిపి మొత్తం 92,394 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 3,502 మంది ఉపాధ్యా యులు పాఠాలు చెప్తున్నారు. విద్యాశాఖపైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ మెషిన్ చొప్పున జిల్లాకు 1,556 మెషిన్లు అందించింది.