- మూడేళ్లుగా విడుదల కాని నిధులు
- కరీంనగర్ జిల్లాలో రూ.171 కోట్ల బకాయిలు
- నిధుల లేక యాజమాన్యాలకు ‘వేతన’ కష్టాలు
- ధ్రువపత్రాల కోసం వెళ్లిన విద్యార్థులపై ఒత్తిడి
- ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న తల్లిదండ్రులు
కరీంనగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల కాకపో వడంతో ఇటు కళాశాల యాజమాన్యాలు, అటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించాల ని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఫీజులపై ఆందోళన చెం దుతున్నారు. విద్యాసంస్థల నిర్వహణతో పాటు అధ్యాపకుల వేతనాలు నెలనెలా సక్రమంగా చెల్లించలేకపోతున్నామని యాజమా న్యాలు వాపోతున్నాయి. కరీంనగర్ జిల్లా ప రిధిలో 2021 నుంచి 2023 విద్యాసంవత్సరాలకు సంబంధించి రూ.171 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీ విద్యార్థులకు 131.35 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. మూడు సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్‌మె ంట్ కోసం 1.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈబీసీ కింద 6984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ సంక్షేమశాఖలో 11,075 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరికి రూ.30.28 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉ ంది. ఎస్టీ సంక్షేమశాఖలో 4,700 మంది ద రఖాస్తు చేసుకోగా రూ.7.50 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉంది. గడిచిన రెండేళ్లలో 50 శాతం బకాయిలు విడుదల కాగా, 2023 సంవత్సరానికి సంబంధించి మొత్తం బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇలాంటి సందర్భ ంలో బకాయిల విడుదలపై విద్యార్థులు, వి ద్యాసంస్థల జేఏసీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయకుంటే ప్రస్తుతం మొదటి సం వత్సర విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని టీజేఏసీ ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాలకు పిలుపునిచ్చింది. చదువులకు ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
బకాయిలను విడుదల చేయాలి..
మూడు సంవ త్సరాలుగా ఫీజురీ యింబర్స్‌మెంట్ 171.13 కోట్లు బకా యిలు ఉన్నాయి. స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యా లు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. జి ల్లా నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నందున విద్యార్థుల కు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్ర భుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నాం.
నర్సింగోజు శ్రీనివాస్,
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్
విద్యార్థులు, తల్లిదండ్రుల అవస్థలు..
చదువు పూర్తిచేసిన విద్యార్థులు ధ్రువపత్రాల కోసం కళాశాలలకు వెళ్లగా యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే పత్రాలు ఇస్తామని చెప్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంత కళాశాలల యాజమాన్యాలకు బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందికి జీతాలు, భవనాల కిరాయిలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పెండింగ్ స్కాలర్‌షిప్స్‌తో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలి.
కసిరెడ్డి మణికంఠరెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు