calender_icon.png 19 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ రైతు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాలి

10-04-2025 01:01:40 AM

పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో  మరింత నమ్మకాన్ని పెంచాలి 

జిల్లా ఎస్పీ  శ్రీనివాసరావు

గద్వాల, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : పంట పండించే ఏ రైతు నకిలీ  విత్తనాలతో మోసపోకుండా  చూడాల్సిన బాధ్యత పోలీస్ పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా లోకి నకిలీ విత్తనాలు రావడం గానీ,  వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ  శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయం లో పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశాన్ని  నిర్వహించి పలు సూచనలు చేశారు  రాబోయే వర్ష కాలం ను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ జిల్లా లోకి రావడం గాని, జిల్లా నుండి రవాణా కానీ జరగకుండా పూర్తీగా నియంత్రించాలని , అందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరం ఐతే పిడి యాక్ట్ క్రింద కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు.

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ పోలీసు వ్యవస్థ పై మరింత నమ్మకాన్ని పెంచే విధంగా పోలీసులు పని చేయాలనీ ఆదేశించారు.  సోషల్ మీడియా లో ఎల్లపుడూ నిఘా ఉంచాలని, గ్రామ లలో వాట్సాప్ గ్రూపులల్ సైతం నిఘా ఉంచాలన్నారు.  ఈ సమావేశంలో డి.ఎస్పి శ్రీ వై మొగులయ్య,  గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు టంగుటూరి శ్రీను, రవి బాబు,  టాటా బాబు , సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్త్స్ర, ట్రైనీ  ఎస్త్స్ర లు,  పాల్గొన్నారు.