calender_icon.png 26 October, 2024 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్జీలను పెంచేది లేదు: బీఎస్‌ఎన్‌ఎల్

23-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సమీప భవిష్యత్తులో తాము టెలికాం చార్జీలను పెంచే అవకాశం లేదని ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సీఎండీ రాబర్డ్ రవి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు సం తోషంగా ఉండటం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడమే బీఎస్‌ఎన్‌ఎల్ ధ్యేయమని చెప్పారు.

ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల మొబైల్ చార్జీలను పెంచిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఈ వ్యాఖ్యలు చేశా రు. బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే టెస్ట్‌మోడ్‌లో 4 సర్వీసులను అందించడం మొదలుపెట్టిందని, ఈ క్యాలండర్ సంవత్సరంలోనే పూర్తిస్థాయిలో 4జీ సేవల్ని ప్రారంభిస్తామని రవి తెలిపారు. 1.8 కోట్ల 4జీ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారన్నారు.  

7 కొత్త సర్వీసులు

బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా ఆఫర్ చేస్తున్న 7 కొత్త సర్వీసుల్ని మంగళవారం టెలికమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా ప్రారంభించారు. స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్  సిమ్ కియోస్కోలు, డైరెక్ట్ టు డివైజ్ సర్వీసులు తదితరాలు ఇందులో ఉన్నాయి. మైనింగ్ కార్యకలాపాలు కోసం లో లాటెన్సీ 5జీ కనెక్టివిటీని ఆవిష్కరించింది.