ప్రస్తుత తరుణంలో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. జిమ్మిక్కులు చేయా లి. క్రియేటివిటీకి పదును పెట్టాలి. అలా పదును పెట్టి చేసిన చిత్రమే ‘మెటా ది డాజిలింగ్ గర్ల్’. ప్రసంద్ మాముల్ దర్శకత్వంలో రూపొందింది. ఇది కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ చిత్రంగా అవార్డును గెలుచుకుని భారత్‌కు గర్వకారణం గా నిలిచింది. ఈ చిత్రాన్ని తిలక్ కొఠారి నిర్మించారు. వచ్చే ఏడాదికి ఆస్కార్‌కు పంపేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఒక అమ్మాయితో కథను మొత్తాన్ని నడిపించారు. ఆమె ముఖం మనకు కనిపించదు. కనీసం ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఏ భాషా చిత్రమో కూడా మనకు తెలియదు. ఈ చిత్రాన్ని డైలాగ్స్ లేని చిత్రంగా చెప్పవచ్చు. కథేంటంటే.. ఒక అమ్మాయి.. ఒంటరిగా ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. అక్కడ అడుగు వేస్తే మరణ భయం వెంటాడుతుంటుంది. జీవన్మరణాల మధ్య ఆ అమ్మాయి ఎలా సర్వైవ్ అయ్యిందనేదే కథ.