16-02-2025 12:28:35 AM
నియామకాలపై నిషేధం విధించిన ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 15: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు సంబం ధించిన నిర్ణయాల్లో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తాజాగా ఆ దేశ మిలిటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ నియామకాలను నిషేధించారు. ఈమేరకు అమెరికా సైన్యం ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్టు చేసింది.
ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో చేరడాన్ని అమెరికా మిలిటరీ విభాగం నిషేధిస్తోందని, సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చేయించుకోవడాన్ని కూడా అనుమతించబోమని పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను తాము గౌరవిస్తామని,
తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భా వించే వారి నియామకాలను నిలిపివేస్తున్నామని పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా, ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. తాజాగా ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని తొలగించడం గమనార్హం.