calender_icon.png 31 March, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగ్టి తాహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి : సీపీఐ డిమాండ్

28-03-2025 05:54:01 PM

నారాయణఖేడ్: రిపోర్టర్లను కార్యాలయంలోకి రావద్దని పోస్టర్ అతికించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా నాయకులు చిరంజీవి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ లో మాట్లాడుతూ రాజ్యాంగానికి నాలుగో స్తంభంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి పోస్టర్ అతికించడం పద్ధతి కాదన్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్టులను ఇలా అవమానించడం పద్ధతి కాదని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతున్నది రిపోర్టర్లే అన్నారు.