calender_icon.png 3 April, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ కౌంటర్లు వద్దు...శాంతి చర్చలే ముద్దు

22-03-2025 02:07:34 AM

సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు 

ఖమ్మం, మార్చి 21 ( విజయక్రాంతి ):- ఎన్ కౌంటర్ల ద్వారా నక్సల్స్ ను చంపడాన్ని ఖండిస్తున్నామని, ఈ సమస్యకు శాంతి చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని, చర్చించి శాంతిని నెలకోల్పాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 మంది నక్సల్స్ ని చంపడం, వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ లేకుండా ఏ రిపారేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం తగదని అన్నారు.

ఇలా ప్రకటించడం మానవ హక్కులను హరించడమేనని తెలిపారు. గత అనేక సంవత్సరాల నుండి నక్సల్స్ ఏరివేత పేరుతో ఆదివాసీ ప్రాంతాలలో, అమాయక ప్రజలను చంపుతున్నారని, ఎన్ కౌంటర్ల ద్వారా కాకుండా చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నున్నా తెలిపారు.

ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయకుండా బలగాలను దింపి ఖాళీ చేయించి, సమాజ వనరులను కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రలు బిజెపి చేస్తోందని అందులో భాగమే ఈ నరమేథం అని తెలిపారు. తక్షణమే ఈ చర్యలను నిలుదల చేసి వారిని చర్చలకు ఆహ్వానించి పరిష్కారం చేయాలని ఆయన కోరారు.