calender_icon.png 5 November, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బిల్లు ప్రతిపాదనలు వద్దు

05-07-2024 01:19:19 AM

కేంద్రానికి ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ వినతి

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): విద్యుత్ (సవరణ) బిల్లు ప్రతిపాదనను ఇప్పుడే తీసుకురావద్దని, ప్రైవేటీకరణ, పట్టణ పంపిణీ ఫ్రాంచైజీల ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసిం ది. సంఘం ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనహోర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని, బొగ్గును తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరింది.

మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ అర్బన్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించారని, అది పూర్తిగా విఫలమైందని పేర్కొంది. ఒడిశాలో మొత్తం విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరించారని ఇది కూడా విఫలమైనట్లు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే, రత్నాకర్‌రావు, పద్మజిత్‌సింగ్, అజయ్‌పాల్ సింగ్, యష్‌పాల్ శర్మ, ప్రశాంత్‌చతుర్వేది ఉన్నారు.