* ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ట్రాఫిక్ పెండింగ్ చలానాలపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాయితీ ఇచ్చిందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. చలానాలపై రాయితీ వార్తలను ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని ట్రాఫిక్ ఏసీపీ పీ విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
అలాంటి విధానం అమల్లోకి వస్తే ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. echallan.tspolice.gov.in వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని వాహనదారులకు సూచించారు.