- అటానమస్ హోదాలూ ఇవ్వొద్దు
- ప్రైవేట్ కాలేజీల అనుమతులు ఆపేయండి
- యూజీసీకీ తెలంగాణ ప్రభుత్వం లేఖలు
- ఇంజినీరింగ్ కాలేజీలకు ఎన్‌వోసీలు ఇవ్వొద్దని జేఎన్టీయూకు సర్కారు హెచ్చరిక
- ఉన్న కోర్సులనే బలోపేతం చేయాలని అధికారులకూ ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ, అటానమస్ హోదా అనుమతులిచ్చే విషయంలో అటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి.. కోర్సుల విలీనం, అదనపు సీట్లకోసం కాలేజీలకు జారీచేసే ఎన్వోసీల విషయంలో ఇటు జేఎన్టీయూ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది.
ఇటీవల కాలంలో జారీచేసిన అటానమస్ హోదా, డీమ్డ్ వర్సిటీల అనుమతులు నిలిపివేయాలని యూజీసీకి ప్రభుత్వం లేఖ రాసింది. తక్షణమే ఆయా అనుమతులను హోల్డ్‌లో పెట్టాలని కోరింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకోవద్దని జేఎన్టీయూహెచ్‌కూ హెచ్చరికలు జారీచేసిం ది.
బీటెక్ కోర్సుల విలీనం అదనపు సీట్లతోపాటు, కొత్తగా అటానమస్, డీమ్డ్ వర్సిటీల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు ఎన్వోసీ ఇవ్వరాదంటూ ఆదేశించింది. ఈమేరకు యూజీసీకి, జేఎన్టీయూకు రాష్ట్ర ప్రభు త్వం వేర్వేరుగా లేఖలను రాసింది.
రాష్ట్రంలో నూతన డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ సీట్ల పెంపు, సీట్ల కన్వనర్షన్, కొత్త అటానమస్ హోదా అనుమతులు లాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇష్టానుసారంగా అనుమతులు
రాష్ర్టంలోని విద్యాసంస్థలకు గత కొన్నేళ్లుగా కేంద్ర సంస్థలు అడ్డగోలుగా డీమ్డ్ యూనివర్సిటీ అనుమతులు, అటానమస్ హోదాలు, సీట్లను పెంచుకుంటూ పోతున్నా యి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ప్రైవేట్ కాలేజీలకు అడ్డగోలుగా డీమ్డ్ యూనివర్సిటీల అనుమతులు ఇవ్వొద్దని యూజీసీని కోరుతోంది.
రాష్ట్రంలో సుమా రు 10కిపైగా కాలేజీలు డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో పది వరకు ప్రైవేట్ వర్సిటీలు వచ్చాయి. ఇప్పుడు డీమ్డ్ వర్సిటీలు రాబోతున్నాయి. అయితే ఇవి యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వీటిల్లో సీట్లు పెంచుకోవాలన్నా, కొత్త కోర్సులు పెట్టాలన్నా యూజీసీ, ఏఐసీటీల అనుమతి తప్పనిసరి. వచ్చే విద్యాసంవత్సరం కోసం ఇప్పటికే కొన్ని కాలేజీలు డీమ్డ్ వర్సిటీల కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే వర్సిటీలు ఎన్వోసీలు ఇవ్వకున్నా దరఖాస్తు చేసుకున్న అన్ని కాలేజీలకు నిబంధనలను సడలించి డీమ్డ్ వర్సిటీలుగా యూజీసీ అనుమతులిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. తమ అనుమతిలేకుండా అనుమతులివ్వొద్దని కోరుతోంది. వాటిని నిలిపివేయాలని లేఖలో తెలిపింది. జేఎన్టీయూ వర్సిటీ అధికారులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్వోసీలు ఇవ్వద్దని ఆదేశించింది.
ఉన్నవాటిని బలోపేతం చేయండి
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీలు, కోర్సులను బలోపేతం చేయాలని తెలంగా ణ ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసిం ది. కొత్త కోర్సులు, సీట్ల పెంపు అంటూ ఇష్టానుసారంగా ఎన్వోసీలు, అనుమతులు జారీ చేయొద్దని తేల్చిచెప్పింది.
ప్రతీ కాలేజీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లను పెంచుకుంటూ పోతే మిగిలిన కోర్ బ్రాంచీల పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. గతంలోనూ కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకొని సీఎస్‌ఈలో సీట్లను పెంచుకునేందుకు సిద్ధపడ్డాయి. ఇందుకు జేఎన్టీయూ ఎన్వోసీలు జారీ చేయగా, అందుకు ఏఐసీటీఈ సైతం ఆమోదం తెలిపింది.
అయితే, ఈ సీట్ల కన్వర్షన్‌కు మాత్రం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీనిపై కాలేజీలు హైకోర్టును ఆశ్ర యించగా, మాప్ ఆప్ కౌన్సిలింగ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేయాలని తీర్పుని చ్చింది. ఇకమీదట ఇలా జరగకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.