* రైతుబంధులో కోతలు అవాస్తవం
* మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రైతు భరోసాపై ప్రభు త్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చపై సభ్యులు తాతా మధు, జీవన్‌రెడ్డి, ఎల్ రమణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ .. తాము ఇచ్చిన నోట్ లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదని, గత ప్రభుత్వంలో జరిగిన విధివిధానాలే సభ ముందు ఉంచినట్టు వివరించారు. గత ప్రభుత్వం 2017 మొదటిసారి రైతుబంధు ఎకరానికి రూ.4వేలు, రెండోసారి అధికారం చేపట్టాక రూ.5వేలకు పెంచిందన్నారు.
పథకంలో పేర్కొన్న విధంగా భూమి సాగు చేసే రైతులకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని, ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. సభ్యుల సూచనల తరువాతే నిర్ణయం తీసుకుం టామని స్పష్టం చేశారు. రైతుబంధులో కోతలు విధిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. రైతు భ రోసాపై మంత్రివర్గ ఉపసంఘం వే శామని.. నివేదిక ఆధారంగా పరిమితులు, నిబంధనలు రూపొం దించి అర్హులకు పెట్టుబడి ఇస్తామన్నారు.