calender_icon.png 13 March, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం

07-03-2025 05:48:25 PM

సుఖ వ్యాధుల కౌన్సిలర్ రాజేశ్వర్

కొల్చారం,(విజయక్రాంతి): హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని మెదక్ జిల్లా ఆసుపత్రి సుఖ వ్యాధుల కౌన్సిలర్ రాజేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని అప్పాజిపల్లి గ్రామంలో శుక్రవారం నాడు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన జరిపి అలాగే రక్త పరీక్షలు నిర్వహించారు. సుమారు 80 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా  విచ్చేసిన రాజేశ్వర్ మాట్లాడుతూ... హెచ్ఐవి ఉన్నవాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని  హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, టెస్టింగ్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు.

హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని అలాగే హెచ్ఐవి ఉన్నవాళ్లు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి అందరికీ ఉచితంగా మందులు అన్ని ప్రభుత్వాసుపత్రిలో ఇస్తామని తెలిపారు. అలాగే ఎవరికైనా హెచ్ ఐవి ఉందని అనుమానం ఉన్న ఎడల ప్రభుత్వాసుపత్రికి వచ్చి ఉచితంగా రక్త పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే హెచ్ఐవి ఉన్నవారికి ప్రభుత్వం కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుస్తుందని అలాగే వారికి ప్రభుత్వం పెన్షన్ కూడా ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఎల్లమ్మ సిబ్బంది సులోచన పుష్పలత కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.