calender_icon.png 23 September, 2024 | 10:56 AM

జడ్చర్ల మున్సిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

25-07-2024 01:05:44 PM

మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోర్ పల్లి లక్ష్మీ పై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్ పర్సన్ దోర్ పల్లి లక్ష్మీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తు, చైర్మన్ పదవి పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కౌన్సిలర్లు గత నెలలో  జిల్లా కలెక్టర్ కు నోటీసు ఇచ్చారు. ఇందుకు కలెక్టర్ స్పందించి ఈనెల 25న అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా ఈరోజు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య సమక్షంలో అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని నిర్వహించారు. ఇట్టి సమావేశంలో మొత్తం 27  సభ్యుల కు గాను మున్సిపల్ చైర్మన్ మినహా 26 మంది కౌన్సిలర్లు పాల్గొని అవిశ్వాస తీర్మానం సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానంకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. అవిశ్వాస తీర్మానం సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ కు సమర్పించి కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చర్యలు జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

పార్టీలు వేరైనా అవిశ్వాసం పై మద్దతు తెలిపిన కౌన్సిలర్లు 

జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ పై గురువారం అవిశ్వాస తీర్మానం  ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పార్టీలు వేరుగా ఉండి ఇతర పార్టీల అభ్యర్థులు మద్దతు కోరుతూ అవిశ్వాసం పెట్టి నెగ్గాలని ఎప్పుడు ఆ ఆ పార్టీల అభ్యర్థులు పరితపిస్తుంటారు. కాగా జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దూరపల్లి లక్ష్మీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే కావడం గమనార్హం. మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మున్సిపల్ లో మొత్తం 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు చైర్పర్సన్ కాగా 6 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, ఒకరు బిజెపి కౌన్సిలర్, 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. గతంలోనే జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్ కు కౌన్సిలర్లు వినతి పత్రం సమర్పించారు.

ఈ మేరకు ఆర్డిఓ నవీన్, మున్సిపల్ చైర్మన్ రాజయ్య సమక్షంలో  అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన కౌన్సిలర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చి మాకు ఈ చైర్ పర్సన్ వద్దంటూ అవిశ్వాసముకు మద్దతు మద్దతు తెలుపుతూ మున్సిపల్ సమావేశం నందు చేతులెత్తారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపికైన మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి తమ పదవి నుంచి వైదొలగల్సి కావాల్సి వచ్చింది. తిరిగి ఇదే పార్టీకి చెందిన కౌన్సిలరే చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 19 సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచే చైర్పర్సన్ కానున్నారు. ఒక కౌన్సిలర్ కూడా  కూడా మున్సిపల్ చైర్ పర్సన్ కు మద్దతు తెలియజేయకపోవడంతో జడ్చర్ల మున్సిపల్ పరిధిలో చర్చకు మరింత తావిస్తోంది. త్వరలో నూతన మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్నందుకు ఈ నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పించి తేదీని తెలియజేస్తామని ఆర్డిఓ నవీన్ తెలియజేశారు.