calender_icon.png 27 December, 2024 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌ చలాన్‌లపై రాయితీ లేదు: ట్రాఫిక్ పోలీసులు

26-12-2024 04:16:44 PM

హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపుకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) గురువారం క్లారిటీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఇ-చలాన్‌లపై ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్, ట్రాఫిక్, పి. విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రాఫిక్ చాలానా(Traffic Challan)లపై రాయితీ వార్తను ఖండించారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దని ట్రాఫిక్ అదనపు సీపీ విజ్ఞప్తి చేశారు. echallan.tspolice.gov.in వైబ్ సైట్ లో సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఇ-చలాన్‌లకు సంబంధించి ఏదైనా సందేహం లేదా స్పష్టత కోసం, దయచేసి హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించండి: 040-27852772, 27852721 లేదా వెబ్‌సైట్‌ను సందర్శించండి.