- ఒక్కో కాలేజీలో ఒక్కో పద్ధతిలో ప్రవేశాలు
- పక్కగా అమలుకాని నిమిషం నిబంధన
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల్లో లేట్ (ఆలస్యంగా) ఎంట్రీ విషయంలో స్పష్టత కొరవడింది. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో పద్ధతిలో విద్యార్థులను అనుమతిస్తున్నారు. దీనిపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కో రుతున్నారు.
రాష్ట్రంలో ఎప్‌సెట్, ఎడ్‌సెట్, ఐసెట్ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నా రు. ఒక్క పీఈసెట్ మినహా అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని పరీక్షలకు నిమిషం ఆలస్య నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించడం లేదు.
అయితే పలు విద్యాసంస్థలు, కాలేజీల్లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నా రు. విద్యాసంస్థలకు, బ్లాక్‌లకు వేర్వేరు గేట్లు ఉంటున్నాయి. కొన్ని ల్యాబ్‌ల గేట్ల వద్ద నిమిషం నిబంధన అమలు చేస్తుండగా, కొన్నింటిలో మెయిన్ గేట్ ఎం ట్రీని ప్రమాణికంగా తీసుకుంటున్నారు. టీసీఎస్ అ యాన్ సెంటర్ల వద్ద సైతం ఇదే పరిస్థితి నెలకొంటుం ది.
నీరుడు ఎప్‌సెట్ పరీక్షలప్పుడు కర్మాన్‌ఘాట్‌లో రెండు సెంటర్ల వద్ద విభిన్న పరిస్థితులు నెలకొన్నా యి. ఒక సెంటర్‌లో మెయిన్‌గేట్ ఎంట్రీని ప్రామాణికంగా తీసుకోగా, మరో సెంటర్‌లో ల్యాబ్ గేట్ ఎంట్రీని ప్రమాణికంగా తీసుకున్నారు. దీంతో పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులు తనిఖీలకు వచ్చి న అధికారులను ప్రశ్నించారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
స్పష్టత ఇవ్వాలి..
రాష్ట్రంలో ఎప్‌సెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి ప్రవే శ పరీక్షలు మే, జూన్‌లో జరగనున్నాయి. కీలకమైన ఎప్‌సెట్ పరీక్షలు మే 2 నుంచి ఐదు వరకు జరగనున్న విషయం తెలిసిందే. అన్ని పరీక్షల షెడ్యూ ల్స్‌ను ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 3 నుంచి అన్ని సెట్ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నారు.
నిబంధనల్లో ఏమైనా మార్పులుంటే ఈ సమావేశాల్లోనే చర్చించి మార్పులు చేర్పులు చేస్తారు. ఈ సమావేశాల నేపథ్యంలో ఏ గేట్ దాటితో ఎంట్రీ అయినట్లో స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.