- నాణ్యమైన ప్రమాణాలతో పాలు ఉత్పత్తి చేస్తున్నాం
- తెలంగాణలో నెంబర్ వన్‌గా నిలిచాం
- కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు
కరీంనగర్, జనవరి 7 (విజయక్రాంతి): కరీంనగర్ డెయిరీపై కొంతమంది పొల్యూ షన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశారు, డెయిరీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బ తింటున్నాయని, కెమికల్స్ కలుపుకున్నారని, టీడీఎస్ పెరుగుతుందని ఫిర్యాదు చేశారు, మేము నాణ్యమైన ప్రమాణాలతో పాలను ఉత్పత్తి చేస్తూ తెలంగాణలో నెంబర్ సన్ గా నిలిచామని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ(కరీంనగర్ డెయిరీ) చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు తెలిపారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధారం లేని ఆరోప ణలు చేస్తున్నారని, కరీంనగర్ డెయిరీ పాలలో నీళ్లు కలుపుతున్నారని, డెయిరీ నుం చి విష పదార్థాలు విడుదలవుతున్నాయని రకరకాల విమర్శలు చేస్తున్నారని తెలిపారు. లక్ష మంది పాడిరైతు కుటుంబాలకు చెందిన డెయిరీ ఈ డెయిరీ అని, ఆరోపణలు చూస్తే బాధకలుగుతుందని అన్నారు.
గత రెండు, మూడు నెలలుగా కరీంనగర్ డెయిరీని అబాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టమవుతుందని, కరీంనగర్ డెయిరీ సేల్స్ తగ్గించేందుకు విమర్శలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధి కారులు రెండుసార్లు వచ్చి డెయిరీని పరిశీ లించి వెళ్లిపోయారని, చిన్న చిన్న సూచనలు చేశారని, వాటిని పూర్తిచేసి కరీంనగర్ డెయిరీని విజయవంతంగా నడిపిస్తున్నా మని తెలిపారు.
కరీంనగర్ డెయిరీ చుట్టుప క్కల ప్రాంతాలకు ఎటువంటి హాని లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరోగ్యానికి హానికరం చేసే రసా యన పదార్థాలు మేము వాడడం లేదని, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అనుమతితో శాస్త్రీయంగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పాలు, పాల పదార్థాలు ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు.
పలు పెద్ద పెద్ద డెయిరీలు సిటీ నడిబొడ్డులో ఉన్నాయ ని, అక్కడలేని ఇబ్బంది ప్రజలకు ఇక్కడ ఎందుకు కలుగుతుందని తెలిపారు. పాలల్లో నీళ్లు కూడా కలపడం లేదని, తరచు వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతం పాల ఉత్పత్తి రాంనగర్లో జరగడం లేదని, నల్గొండలో నూతన ప్లాంట్లో ఆటోమెషిన్ల ద్వారా ఉత్పత్తి అవుతున్నాయని, రాంనగర్లో మాత్రం పెరుగు, పాల పదార్థాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
ఒకనా డు 12 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరిగిన కరీంనగర్ పాల డెయిరీలో నేడు లక్షా 80 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని, లక్షా 4 వేల లీటర్ల పాలు విక్రయిస్తున్నా మని, 40 వేల లీటర్ల పాల ఉత్పత్తులకు వినియోగిస్తున్నామని, 30 వేల లీటర్లను పౌడర్ తయారుచేయడానికి చిత్తూరుకు పంపిస్తున్నామని వివరించారు. ఈ సమావే శంలో డెయిరీ డైరెక్టర్లు నారాయణ రెడ్డి, ప్రభాకర్‌రావు, ఎండి శంకర్ రెడ్డి, మార్కె టింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.