సుమహతాప్యర్థేన న
కశ్చన శరీర వినాశమిచ్ఛేత్ |
దండ పారుష్యాచ్చ తమేవ
దోశమన్యేభ్యః ప్రాప్నోతి ॥
- కౌటిల్యం: -అధికరణం 8, అధ్యాయం 3
“ఎంత పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చినా తన శరీర వినాశాన్ని ఎవరూ కోరుకోరు. అందుకే, నాయకునికి దండ పారుష్యం అం టే ఇతరులను దండించటంలో కఠినంగా వ్య వహరించడం సమంజసం కాదు. చిన్నతప్పు కు పెద్దశిక్షలను అమలు చేసే నాయకునిపై అవకాశం వచ్చినప్పుడు అనుచరులంతా ఏకమై నాయకుడిని పడదోస్తారు. ఒక్కొక్క మారది ప్రాణాంతకమూ కావచ్చు. పట్టువిడుపులు తెలియని రాజకీయ నేతలకు, ఉన్న తాధికారులకు, న్యాయాధిపతులకు, యజమానులకూ ఇది వర్తిస్తుంది” అంటాడు ఆచార్య చాణక్య.
ఉన్నత విద్యాభ్యాసం చేసిన విజ్ఞానులైనా, నైపుణ్యం, అనుభవం కలిగిన వ్యక్తులైనా ఉ ద్యోగం చేస్తున్న సమయంలో తీసుకునే నిర్ణయాలవల్ల అప్పుడప్పుడు కార్యభంగం కావ చ్చు. అలాంటప్పుడు వారిని తగిన విధంగా మందలించి తిరిగి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం సమంజసమే. కానీ, చిన్నతప్పుకు పెద్దశిక్షలు వేయడం, వారిని అవమానించడం వల్ల వారు ఆ సంస్థను విడిచి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతాయి. అర్హత కలిగిన ముఖ్యమైన మానవ వనరుల మేధోవలస సంస్థ ప్రగతికి విఘాతాన్ని కలిగిస్తుం ది. అంతేకాదు, తమ సంస్థ ఆనుపానులు తెలిసిన వ్యక్తులు తమ ప్రత్యర్థి సంస్థలో చేరి తే తమ సంస్థను ఆర్థికంగా దెబ్బతీస్తారు. అందువల్ల ఉద్యోగులు చేజారకుండా చూసుకోవలసిన అవసరం నాయకునికి ఉంటుంది.
‘సాధారణంగా ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టరు. వారి యజమానులనే విడిచి పెడ తారనే’ సామెత ఉన్నది. అధినాయకుడు ఎ లాంటి వాడైనా, ఉద్యోగికి సంస్థపైన సదభిప్రాయాన్ని లేదా దురభిప్రాయాన్ని కలిగించే ది అతనిని పర్యవేక్షించే పై అధికారి ప్రవర్తనే. తనలోని అత్యుత్తమ నైపుణ్యాలను వెలికి తీసుకునేందుకు, తనపై అధికారి ప్రేరణనిస్తే ఉద్యోగి తన పనిని ఇష్టపడి చేస్తాడు. సామర్థ్యాన్ని మించి సంస్థ పురోగతికై కృషి చేస్తా డు. అలా కాక అవమానాల పాలు చేస్తే అవకాశం రాగానే సంస్థను గాలి కొదిలేసి వెళ్ళిపోతాడు.
“న్యాయంగా రావలసిన జీతభత్యాలను సకాలంలో అందించని పాలకులకు ఉద్యోగు లు కీడు చేస్తారు” అంటాడు నారదుడు, ధ ర్మరాజుతో ‘మహాభారతం’లోని సభాపర్వం లో. భార్యాపిల్లల పోషణకై అహర్నిశలు శ్ర మించే ఉద్యోగికి నెల చివరలో అందే జీతభత్యాలే నెలంతా ఉత్సాహంగా పని చేసేం దు కు ప్రేరణగా నిలుస్తాయి. కాలానుగుణంగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని గమ నిస్తూ ఉద్యోగిని ఆర్థికంగా ఉన్నతీకరించిన నాయకునికి మనస్ఫూర్తిగా ఉద్యోగి సహకరిస్తాడు.
అయితే, ఉద్యోగి ఇష్టపూర్తిగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలను సాధించేందుకు, జీతభత్యాలకు అదనంగా యజమాని ఉద్యోగికి ఇచ్చే గుర్తింపు, గౌరవం కూడా సంస్థపట్ల విధేయునిగా పని చేసేందుకు ప్రేరణగా నిలుస్తుంది. పని చేసే ప్రదేశంలో సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించిన నాయకు ని ఆధ్వర్యంలో అత్యుత్తమ ఫలితాలను ఆవిష్కరించేందుకు తన పరిధికి మించి ఉద్యోగి శ్రమిస్తాడు.
అంతేకాక, ఉద్యోగ భద్రత కూడా ముఖ్యమైందే. ప్రస్తుతం చాలామంది కొద్ది మొత్తం ఎక్కువ జీతం అందితే ఆయా సంస్థలను వి డిచి వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఆయా రం గాలలో శిక్షణ పొంది, కీలకమైన పదవులు నిర్వహిస్తూ.. ఉత్పత్తి, ఉత్పాదకతలను ప్రభావితం చేయగలిగిన ఉద్యోగులలో అభద్రతా భావన నెలకొంటే వారు అశాంతికి గురై అ వకాశం వస్తే నిష్క్రమించేందుకు సన్నద్ధులౌతారు.
నాయకుడు ఉద్యోగులలో.. ‘ఈ సంస్థలో నేనొక ఉద్యోగిననే భావనను కాకుండా ఈ కుటుంబంలో నేనొక ముఖ్యమైన సభ్యుడిననే’ ఆత్మీయతను పొందితే మనసు పెట్టి పని చేస్తాడు. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఫలితాలను రాబడుతాడు. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, మానసికోల్లాసానికి అవకాశాలు ఉన్న సంస్థలో పని చేసే ఉద్యో గులలో.. ‘నేను నా అర్హతకు తగిన సంస్థలో సరైన స్థానంలో ఉన్నాననే’ భావన కల్పించగలిగితే ఉద్యోగులు ఉత్సాహంగా పనిచే స్తారు. అలా కాని పక్షంలో నాయకుడు తన గోతిని తానే తీసుకున్నట్లుగా భావించాలి.