calender_icon.png 15 March, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రన్యారావుకు నో బెయిల్

14-03-2025 11:31:55 PM

తేల్చి చెప్పిన కోర్టు

తరుణ్‌ బెయిల్ పిటిషన్‌పై శనివారం విచారణ

బెంగళూరు: అక్రమ బంగారం కేసులో కన్నడ నటి రన్యారావు కోర్టులో గట్టి షాక్ తగిలింది. తన విడుదలకు అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేయాలని రన్యారావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎకనమిక్ అఫెన్సెస్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సి వచ్చింది. ఇక ఈ కేసులో ఏ2గా ఉన్న తరుణ్ బెయిల్ పిటిషన్‌ను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. రన్యారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు విచారణలో పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

బంగారం స్మగ్లింగ్ చేయమని తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయని రన్యారావు తెలిపారు. అంతే కాకుండా స్మగుల్ చేసేందుకు యూట్యూబ్ వీడియోలు చూసి తర్పీదు పొందినట్లు కూడా వెల్లడించిందని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొంత మంది వ్యక్తులు సిండికేట్‌లా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీబీఐకి ఫిర్యాదు చేయడంతో వారు కూడా రంగంలోకి దిగి వేగంగా విచారణ జరుపుతున్నారు. రన్యారావు కేసు ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని చాలా మంది అధికారులు టెన్షన్‌గా ఉంటున్నట్లు సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహరానికి సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగింది.