calender_icon.png 7 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణదాస్‌కు బెయిల్ నో

03-01-2025 01:31:09 AM

  • లభించని ఊరట

బెయిల్‌కు నిరాకరించిన బంగ్లా కోర్టు

న్యూఢిల్లీ, జనవరి 2: బంగ్లాలో అరెస్టయిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం జైలులో ఉన్న కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనను చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని గురువారం ఇస్కాన్ కోల్‌కతా వెల్లడించింది. దీంతో ఆయన మరిన్ని రోజుల పాటు జైలు జీవితం గడపనున్నారు. కృష్ణదాస్ తరఫున 11 మంది లాయర్లు వాదించినా ఫలితం దక్కలేదు. దాదాపు 30 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. 

భద్రత కట్టుదిట్టం

చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అనంతరం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్ వాదనల సమయంలో న్యాయస్థానం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమనిచటోగ్రామ్ న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయన మీద దేశద్రోహం కేసు నమోదైంది. గతేడాది నవంబర్‌లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

కేసు వివరాలివే...

ఇస్కాన్ ప్రచారకర్తగా బంగ్లాలో విధులు నిర్వర్తిస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబర్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చిన్మయ్ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే అభియోలు ఉన్నాయి. దీంతో న వంబర్ 25 2024లో స్థానిక పోలీసులు చిన్మయ్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

చిన్మ య్ కేసును వాదించేందుకు ఒప్పుకున్న న్యా యవాదుల మీద ఆందోళనకారులు దాడులు చేయడంతో ఆయన కేసును టేకప్ చేసేందు కు ఓ న్యాయవాది కూడా ముందుకు రాలే దు. కానీ చివరికి ఆయన భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ చొరవతో 11 మంది లాయర్లు ముందుకొచ్చా రు. లాయర్లు ముందుకొచ్చి వాదించినా కానీ ఆయనకు మాత్రం బెయిల్ లభించలేదు. 

చిన్మయ్‌కి అనారోగ్యం 

చిన్మయ్ కృష్ణదాస్ 42 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారామ్మోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘చిన్మయ్‌కి కొత్త ఏడాదిలోనైనా జైలు జీవితం నుంచి విముక్తి కలుగుతుందని ఆశించాం. కానీ ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. చిన్మయ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. అతడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది’ అని అన్నారు.