22-04-2025 01:28:51 AM
ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
కల్లూరు, ఏప్రిల్ 21:- పాలకులకు ప్రజల కష్టాలపై ధ్యాసే లేకుండా పోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.కల్లూరు మండలం లింగాల పర్యటన సందర్బంగా ఆ మె ప్రధాన అనుచరుడు దేవరపల్లి పట్టాభిరామ్ కు సంబందించిన గృహ ప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్నారు.గ్రామ పర్యటనలో ఆమెకు మహిళ లు హరతులు ఇచ్చి ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్బంగా గ్రామంలో జరిగిన సభలో కవిత మాట్లాడుతూ తమ్ముడు పట్టాభిరామ్‌తో తనకు చాలా అనుబంధం ఉంద ని, జాగృతి కార్యక్రమాల్లో నా వెన్నంటే పనిచేశాడని అన్నారు.రాష్ట్రంలో వానలు పడు తుంటే మంత్రులకు తీరికలేకుండా పోయిందని అన్నారు.
మంత్రుల ఆలోచన హెలికా ప్టర్ మీద చేపల పులుసు మీద ఉంది... తప్ప ప్రజల మీద, ప్రజల కష్టాల మీద లేదన్నారు.ఖమ్మం జిల్లాలో ముగ్గు రు మంత్రు లున్నారు..వారు ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి, వారి కష్టాల గురించి ఆలోచించట్లేదని విమర్శించారు.వడగళ్ల వాన పడితే కేసీఆర్ అధికారులను , ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపి ఎకరాకు పదివేల నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేశారు.సత్తుపల్లిలో మా మిడి ,వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందని,ఎకరాకు రూ..20,000 నష్టపరిహారం రైతులకు చెల్లించాలని డిమాం డ్ చేశారు.
మార్చి 31కి రైతు భరోసా పడుతుందని చెప్పారు అందరికీ పడిందా..?? అని ప్రజల్ని అడిగారు.60 శాతం మం ది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.తమ్ముడు పట్టాభిరామ్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని,వాళ్ల కుటుం బం ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారని అన్నారు.అన్న సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో పట్టాభిరామ్ రాటు తేలాడు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్,మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పాలేపు రామారావు, కట్టా అజయ్ బాబు, బీరవెల్లి రఘు మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.