calender_icon.png 23 November, 2024 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాదనలు వద్దు!

22-11-2024 12:00:00 AM

ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న కలతలు సాధారణమే. అయితే కొంద రు దంపతులు మాత్రం మాటకు మాట చెప్పుకుంటూ వాదనలు పెంచుకుంటూనే ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఏదైనా సమ స్య వచ్చినప్పుడు దానికి కారణం నువ్వంటే నువ్వంటూ ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిష్కారం ఉండదు. ముందు ఆ పరిస్థితికి కారణం ఏంటో గమనించుకోండి.

అనుకోకుండా జరిగినా, ఉద్దేశపూర్వకంగా చేసినా సరే ముందు దాన్ని సరిదిద్దేందుకు మీ వంతుగా ఏం చేయగల రో చెప్పండి. అప్పుడు ఎదుటివారూ స్పందిస్తారు. త్వరగా సమస్య పరిష్కారమవుతుంది. భాగస్వామితో లోపాలను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకుంటే, వారూ తిరిగి అదే పనిచేసే అవకాశం ఉంది. వేర్వేరు మనస్తత్వాలు కలిగిన ఇద్దరూ కలిసి సాగించే ప్రయాణంలో సర్దుబాట్లు ఉం డాలి. భార్యాభర్తలు ఇద్దరూ చెరిసగం అనుకుంటే సమస్యలు వచ్చినా తామరాకు మీద నీటిబొట్టులా జారిపోతాయి.

అలాకాకుండా.. తమదే పై చేయి కావాలనుకోవడం, తాను చెప్పిందే వినాలనుకోవడం, ప్రతిదీ తనకు తెలియాలనుకోవడం వంటివన్నీ మీకు అభద్రతను, అవతలివారికి అశాంతినీ కలగజేస్తాయి. వాదోపవాదాలకు కారణం అవుతాయి.