calender_icon.png 22 October, 2024 | 11:41 PM

ఎన్‌ఎల్‌సీ చేతికి మచ్చకాట బొగ్గుబ్లాక్

16-07-2024 01:11:34 AM

హైదరాబాద్, జూలై 15(విజయక్రాంతి): కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఎనిమిదో రౌండ్ వాణిజ్య బొగ్గు బ్లాకుల వేలంలో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న మచ్చకాట బొగ్గు గనిని విజయవంతంగా దక్కించుకుంది.  ఈ బొగ్గు బ్లాక్‌లో 1.38 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అంచనా.  రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో ధడు బొగ్గు బ్లాక్ తర్వాత ఎన్‌ఎల్‌సీ దక్కించుకున్న రెండో బొగ్గు బ్లాక్ ఇది.

ఈ బొగ్గు బ్లాక్‌నుంచి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 50 ఎంటిపీఏ( ఏటా ఉత్పత్తి)ను 2030 నాటికి 100 ఎంటీపీఏ స్థాయికి పెంచాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఆదివారం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి,నామినేటెడ్ అథారిటీ ఎం నాగరాజు,  ఎన్‌ఎల్‌సిఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మోటుపల్లి, సంస్థ డైరెక్టర్ సురేశ్ చంద్ర సుమన్, సీజీఎం చెరుకు దయానంద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.